Vijayasai Reddy: అన్నయ్యా? పైనుంచి కోడెల పిలుస్తున్నాడా?.. బాబు పై విజయసాయి ట్వీట్స్

-

Vijayasai Reddy viral tweets on tdp leaders: టీడీపీ అధినేత చంద్రబాబు, పట్టాభిరామ్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వరుస ట్వీట్స్‌తో విమర్శలు చేస్తున్నారు. స్వయంగా ఆయనే పెడుతున్నారో .. లేక ఆయన టీమ్ చేస్తున్నారో తెలియదు కానీ.. సోషల్ మీడియా‌లో కొన్నీ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్‌‌గా మరుతున్నాయి. తాజాగా శుక్రవారం విపక్ష నేత చంద్రబాబు పై కొన్ని సెటైర్స్ వేశారు. ‘‘నైరాశ్యంతో పోయేట్టున్నాడు మా చంద్రం అన్నయ్య. నాలుగు రోజులు కట్టేసైనా ఇల్లు కదలకుండా చేయండయ్యా! కుప్పం ప్రజలు తరిమికొట్టినప్పుడే లాస్ట్ ఎలక్షన్ అని అర్థమైంది. మనకు మళ్లీ ఈ ఏడుపులేంటి అన్నయ్యా? పైనుంచి కోడెల గాని పిలుస్తున్నాడా? అని వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. అంతటితో అగకుండా.. ‘‘అన్నయ్యా!… పది రోజులకోసారి రాష్ట్రానికి వచ్చిపోయే టూరిస్టువి. మనకు గెలుపు ఓటములతో పనేంటి కానీ ..ఐదు లక్షల కోట్లు దోచుకున్నావు కదా! విదేశీ బ్యాంకుల్లో నీ డబ్బే కుప్పలుగా పడి ఉందంట. నీకు లాస్టులు, ఫస్టులేమిటి కామెడీ కాకపోతే. మన కుటుంబంలో ఎవరి వాటా వాళ్ళకిచ్చేయ్ అన్నయ్యా!.. అని అపహాస్యం చేశారు. కాగా అంతక ముందే.. టీడీపీ నేత పట్టాభి పై కూడా ట్వీట్ చేశారు. ‘‘ఒరేయ్ ‘పొట్టా’భి! నువ్వేం మాట్లాడతావో నీకే తెలియదురా! గతంలో ఇలా మాట్లాడే మాల్దీవ్స్ పారిపోవాల్సి వచ్చింది. నీకు దేవుడు దున్నపోతులా శరీరాన్నిచ్చాడు కానీ అందులో ఆవగింజంత కూడా మెదడు పెట్టడం మర్చిపోయాడురా… అని Vijayasai Reddy ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...