పులిచింతల నుంచి లక్ష క్యూసెక్కుల వరద నీరు రావటంతో, ఈ సంవత్సరం దుర్గామల్లేశ్వర స్వామి వార్ల నదీ విహారం లేనట్లేనని అధికారులు ప్రకటించారు. ప్రతి ఏటా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కృష్ణానదిలో దుర్గామల్లేశ్వర స్వామి వార్ల నదీ విహారం నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. కాగా, పులిచింతల నుంచి లక్ష క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో, స్వామి వార్ల నదీ విహారం సాధ్యపడదని జల వనరుల శాఖ కలెక్టర్‌కు రిపోర్ట్ పంపించింది. మూడు రోజుల పాటు కృష్ణా నదిలో ప్రవాహం కొనసాగుతుందనీ, అందువల్లే స్వామి వార్ల నదీ విహారం చేపట్టలేకపోతున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. దుర్గాఘాట్‌లో హంస వాహనంపై స్వామి వార్ల ఉత్సవ మూర్తులను ఉంచి పూజా కార్యక్రమాలు యాథావిధంగా ఉంటాయని తెలిపారు. తెప్పోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు, భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఢిల్లీరావు ప్రకటించారు.
ఈ సంవత్సరం దుర్గామల్లేశ్వర స్వామి నదీ విహారం లేనట్లే
-