Vijayawada nri medical college huge funs diverted: మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి, విజయవాడలోని అక్కినేని ఉమెన్ మెడికల్ కాలేజీ పై ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా.. సోదాలు ముగించుకొని కొద్దిసేపటి క్రితం ఎన్నారై ఆస్పత్రి నుంచి ఈడీ అధికారులు వెళ్లిపోయారు. అయితే.. విజయవాడ (Vijayawada)ఎన్నారై మెడికల్ కాలేజీ నుంచి రూ. 25 కోట్లు దారి మళ్లినట్లు ఈడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఎంబీబీఎస్, పీజీ సీట్ల ఫీజులు దారిమళ్లించినట్లు ఉన్న ఆధారాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పన్ను రాయితీల కోసం ఎన్‌ఆర్ఐలు ఇచ్చిన విరాళాలను ఆస్పత్రి డైరెక్టర్ డ్రా చేసినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తుంది. అధికారులు ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో 2016 నుంచి ఉన్న అన్ని రికార్డులను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. కోవిడ్ సమయంలో 1500 మందికి పైగా రోగుల నుంచి వసూలు చేసిన రూ. 30 కోట్లను దారి మళ్లించినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.