Bjp Leader Vishnu Kumar Raju :వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానంలోనే వైసీపీ

-

Bjp Leader Vishnu Kumar Raju Fires on Cm Jagan: జగన్ విశాఖలో కూర్చుని రాష్ట్ర పాలనసాగిస్తానంటే కాదనలేమని, కానీ విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా అంగీకరించేది లేదని బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజు పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పరాభవం తప్పదని.. ప్రతిపక్ష స్థానంలోనే వైసీపీ ఉంటుందన్నారు. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ పెద్ద ఎత్తున జరుగుతోందని ఆరోపించారు. ఈ లిక్కర్ స్కామ్ పై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు. జనసేన పార్టీని సీఎం జగన్ రౌడీసేన అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీడీపీ బూతుల పార్టీ అనడాన్ని తప్పు బడుతున్నామని.. రాష్ట్రంలో బూతుల సంస్కృతి తెచ్చిందే వైసీపీ పార్టీ అని అన్నారు. సీఎం జగన్‌ సభకు హాజరయ్యే ప్రజలకు డ్రెస్ కోడ్ ప్రకటిస్తూ ప్రభుత్వం ఒక జీవో జారీ చేయాలని అపహాస్యం చేశారు. నరసాపురం సభకు వచ్చిన మహిళలతో చున్నీలు తీయించడం సరికాదన్నారు. మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మకు ఈ చర్యలు తప్పుగా కనిపించ లేదా అని (Bjp Leader Vishnu Kumar Raju) ప్రశ్నించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...