మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో(Viveka Murder Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్యాస్థలంలో దొరికిన లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్ష(Ninhydrin Test) జరిపేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉన్నందున ఈ టెస్టుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ అధికారుల వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. 2021 ఫిబ్రవరి 11న లేఖను ఢిల్లీలోని CFSL ల్యాబ్‌కు సీబీఐ అధికారులు పంపారు. దీనిని పరీక్షించిన CFSL వివేకా తీవ్ర ఒత్తిడితో రాసిన లేఖగా నిర్ధారించింది. ఈ క్రమంలో లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని అధికారులు కోరగా.. అలా చేయాలంటే నిన్ హైడ్రిన్ పరీక్ష జరపాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ పరీక్షకు కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో లేఖపై అనుమానితుల వేలిముద్రలు ఉన్నాయో? లేదో? నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది.
వివేకా రాసిన లేఖపై నిన్‌హైడ్రిన్ టెస్టుకు సీబీఐ కోర్టు అనుమతి
-