Vizag Steel | ఉక్కు ఉత్పత్తిలో విశాఖ ఉక్కు సరికొత్త రికార్డ్ సృష్టించింది. వంద మిలియన్ టన్నుల ఉత్పత్తిని పూర్తి చేసుకుని అరుదైన మైలురాయిని అధిగమించింది. ఈ సందర్బంగా విశాఖ ఉక్కు కార్మికులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిశ్రమ 1990 నవంబర్‌లో ఉత్పత్తిని ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 100 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసింది.
ఈ ఏడాది 7.2 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ముడిసరుకు విషయంలో అనేక సమస్యలు రావడంతో ఈ లక్ష్యాన్ని సాధించలేకపోయింది. ఇటీవల విశాఖ ఉక్కును పునరుద్దరించడానికి, విశాఖ ఉక్కు పరిష్కారం కోసం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి.. వైజాగ్‌లో పర్యటించారు. ఉక్కు కర్మాగారం మొత్తాన్ని పరిశాలించారు. ఇక్కడి సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. విశాఖ ఉక్కు(Vizag Steel) ప్రైవేటీకరణ జరగదని హామీ ఇచ్చారు.