విశాఖపట్టణంలో సంచలనం రేపిన వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ(MVV Satyanarayana) కుటుంబ సభ్యుల కిడ్నాప్ కథ సుఖాంతమైంది. దుండగులు ఎంపీ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ జీవీని కిడ్నాప్ ఇవాళ ఉదయం కిడ్నాప్ చేశారు. రుషికిండలోని ఎంపీ ఇంట్లోకి చొరబడిన కిడ్నాపర్లు భార్య, కుమారుడి చేత ఆడిటర్‌కు ఫోన్ చేయించారు. ఆడిటర్ రాగానే ముగ్గుర్ని కలిపి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఎంపీ ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కొద్దిసేపటికే ముగ్గురు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. వీరిని విశాఖ-ఏలూరు రోడ్డులో గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. రౌడీషీటర్ హేమంత్(Rowdy Sheeter Hemanth) ఈ కిడ్నాప్ చేయించినట్లు తెలుస్తోంది. ఎంపీతో ఉన్న వ్యాపార లావాదేవీల విషయంలో ముగ్గుర్ని కిడ్నాప్ చేసినట్టు సమాచారం. కిడ్నాప్ చేసిన అనంతరం రూ.50 కోట్లు డిమాండ్ చేశారని చెబుతున్నారు. పట్టపగలు సాక్షాత్తూ అధికార ఎంపీ(MVV Satyanarayana) ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేయడం విశాఖలో కలకలంరేపుతోంది. పోలీసులు ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖలో సంచనలం.. వైసీపీ ఎంపీ కుటుంబసభ్యులు కిడ్నాప్
-