వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారీ వరదల కారణంగా చేరిన బురద తొలగింపును యుద్దప్రాతిపదికన చేపడుతున్నట్లు చంద్రబాబు(Chandrababu) వెల్లడించారు. సహాయక చర్యల గురించి ఆయన విజయవాడ(Vijayawada)లో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. ఎక్కడ ఏ అవసరం వచ్చినా ప్రజలకు తామ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సహాయక చర్యల్లో భాగంగా 62 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని, వేస్టేజ్‌ను తొలగించడానికి భారీ మొత్తంలో పారిశుధ్య సిబ్బందిని, యంత్రాలను తెప్పించామని వెల్లడించారు.
‘‘32 మంది ఐఏఎస్ అధికారుల ఈ సహాయక చర్యల్లో పాలుపంచుకోనున్నారు. 179 సచివాలయాలకు 179 మంది సీనియర్ అధికారులను ఇన్‌ఛార్జ్‌లుగా పెట్టాం. బురద తొలగింపుకు 2,100 మంది పారిశుధ్య కార్మికులను, 100కుపైగా ఫైరింజన్లు, పదుల సంఖ్యలో ప్రొక్లెయినర్లు, టిప్పర్లను కూడా రంగంలోకి దించాం. వీటితో పాటు ప్రజల ఆరోగ్యంపై కూడా దృష్టిపెట్టి వారికి అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించేలా మెడికల్ క్యాంపులు సిద్ధం చేశాం. చనిపోయిన వారి మృతదేహాలకు సత్వరం వారి కుటుంబీకులకు అందించేలా చర్యలు చేపడుతున్నాం’’ అని CM Chandrababu చెప్పారు.