Weather report: ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, బుధ, గురువారాల్లో రెండు రోజులు పాటు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీలంక తీర ప్రాంతం మీదుగా ఆవర్తనం కొనసాగుతుండటంతో పాటు.. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ అధికారులు తెలిపారు.
Weather report: బుధవారం అల్లూరి సీతరామరాజు, ఏలూరు, నెల్లూరు, తిరుపతి, కడప, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతరామరాజు, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అవసరమైతే తప్ప వర్షంలో బయటకు రావొద్దని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని.. వరద ప్రవాహం ఎక్కువుగా ఉంటే.. దగ్గర్లోనే ఉన్న తుపాన్ భవనాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు.