ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ అంటే ఏమిటి?

-

ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు 2015లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పదం కుదుర్చుకుంది. రూ. 3 వేల 356 కోట్ల ఈ ప్రాజెక్టులో రూ. 371 కోట్లు దారి మళ్లాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో 2020లో ఇప్పటి వైసీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 2020 డిసెంబర్ 10న విజిలెన్స్, 2021 ఫిబ్రవరిలో ఏసీబీ విచారించింది. అనంతరం ఈ కేసు సీఐడీకి బదిలీ అయింది. ఇందులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా అచ్చెన్నాయుడు పేర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్‌విత్‌ 34, 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

- Advertisement -

స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రాజెక్టులో సీమెన్స్ సంస్థ వాటా 90శాతం.. రాష్ట్రప్రభుత్వం వాటా 10శాతంగా ఉంది. సీమెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఆ MOU పక్కనపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. సీమెన్స్‌ స్థానంలో ఎలాంటి MOU లేకుండానే డిజైన్‌టెక్‌ కంపెనీకి అప్పగించారని.. సీమెన్స్‌ నుంచి రూపాయి రాకుండానే ప్రభుత్వం నుంచి రూ.371 కోట్లు విడుదల చేశారని ఆరోపిస్తున్నారు. రూ. 371కోట్లలో డిజైన్‌టెక్‌ కంపెనీకి రూ. 240కోట్లు చేరాయని.. డిజైన్‌టెక్‌ నుంచి వివిధ షెల్‌ కంపెనీలకు రూ. 240కోట్లు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో విచారణ చేపట్టిన వైసీపీ ప్రభుత్వం సీమెన్స్ కంపెనీ, డిజైన్‌టెక్‌ కంపెనీలపై కేసులు నమోదుచేసింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి రూ.30కోట్లు అటాచ్ చేసింది. తాజాగా చంద్రబాబుతో మరికొందరిని అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...