What Is EWS | ఈడబ్ల్యూఎస్ అంటే ఎకానిమికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఆర్థికంగా బలహీన వర్గాల వారు అని. ప్రభుత్వ ఉద్యోగాల్లో కేవలం కుల ప్రాతిపదికన కాకుండా ఆర్థిక స్థితి పరంగా రిజర్వేషన్లు కల్పించాలని, జనరల్ కేటగిరీలో కూడా ఆర్థికంగాబలహీనంగా ఉన్న వారు ఎందరో ఉన్నారని, వారికి కూడా అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ చట్టంలో కీలక సవరణ తీసుకొచ్చింది. అదే ఈ ఈడబ్ల్యూఎస్. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలై విచారణ జరగగా అంతిమంగా అత్యున్నత న్యాయస్థానం కూడా కేంద్ర తీసుకున్న నిర్ణయానికి మద్దతిచ్చింది.
What Is EWS | విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి 10శాతం రిజవర్వేషన్లు కల్పించేలా 2019లో కేంద్రం తీసుకొచ్చిన రాజ్యంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15, 16ల్లో ప్రత్యేక నిబంధనలను కూడా చేర్చింది. ఫలితంగా రిజర్వేషన్లు అందని ఉన్నత కులాల్లోని ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించింది. దీనికే సుప్రీంకోర్టు కూడా మద్దతు తెలుపుతూ 2021 మే నెలలో తన తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలోనే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయాలంటూ నేషనల్ మెడికల్ కమిషన్ గతేడాది అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఆ దిశగానే చర్యలు తీసుకుంటూ ఏపీ సర్కార్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.