YCP Manifesto : వైసీపీ మేనిఫెస్టో కొత్త హామీలు ఇవే..

-

వైసీపీ మేనిఫెస్టోను తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విడుదల చేశారు. తొమ్మిది ముఖ్యమైన హామీలతో.. కేవలం రెండు పేజీలతో మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలిపారు. అబద్దాలతో చంద్రబాబుతో పోటీపడలేనని.. చేయగిలిగేవి మాత్రమే తాను చెబుతానని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99శాతం నెరవేర్చామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత తమకు దక్కుతుందన్నారు. మ్యానిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం, భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించామని.. ఓ ప్రొగ్రెస్ కార్డు మాదిరి ఏం చేశామన్నది ప్రజలకు వివరించామని జగన్ చెప్పారు.

- Advertisement -

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు..

* అమ్మ ఒడి పథకం కింద ఇస్తున్న రూ.15వేలను రూ.17వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

* వైఎస్సార్ చేయూత నాలుగు విడతల్లో రూ.75వేల నుంచి రూ.లక్షా 50 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు

* రెండు విడతల్లో పింఛన్లు రూ.3500 చెల్లిస్తామని ప్రకటించారు (2028 జనవరిలో రూ.250, 2029 జనవరిలో రూ.250 పెంపు)

* వైఎస్సార్ కాపు నేస్తం నాలుగు దశల్లో రూ.60 వేల నుంచి రూ.లక్షా 20వేలకు పెంపు

* వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింది రూ.3 లక్షల వరకు రుణాలు ఇస్తామని ప్రకటించారు

* వైఎస్సార్ ఈబీసీ నేస్తం నాలుగు విడతల్లో రూ.45వేల నుంచి రూ. లక్షా 5 వేలకు పెంపు

* కళ్యాణ మస్తు, షాదీ తోఫా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు

* రైతు భరోసా కింద ఇచ్చే సొమ్ము రూ.13,500 నుంచి రూ.16వేలు పెంపు (కౌలు రైతులకు రైతు భరోసా కొనసాగింపు)

* అర్హులై ఇళ్ల స్థలాలు లేనివాళ్లందరికీ ఇళ్లు.. ఇళ్ల పట్టాల కొనసాగింపు

* అమ్మ ఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్సార్‌ చేయూత తదితర పథకాల కొనసాగింపు

* ఆటో, ట్యాక్సీ, లారీలు కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ ప్రకటించారు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...