YCP MLA Vasantha Krishna Prasad: వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈరోజుల్లో రాజకీయాలు చేయాలంటే పదిమంది పోరంబోకులను వెంటేసుకొని తిరగాలన్నారు. అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు చాలా తేడా ఉందన్నారు. నేను ఆ కాలంనాటి రాజకీయ నాయకుడిగా మిగిలిపోయాను అన్నారు. సోమవారం ఆయన తండ్రి టిడిపి ఎంపీ కేశినేని నానితో భేటీ అవ్వడం.. ఆ తర్వాత ఎమ్మెల్యే వసంత ఈ కామెంట్స్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
నేను పుట్టేసరికి మా నాన్న రాజకీయాల్లో ఉన్నారు. దాదాపు 55 ఏళ్ల నుండి మా కుటుంబం రాజకీయాల్లోనే ఉంది. అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి చాలా గణనీయమైన మార్పు వచ్చింది. ఈనాటి రాజకీయ నాయకులు వేగంగా ముందుకు పరిగెట్టాలంటే ఆనాటి రాజకీయం పనికిరాదు. పక్కనే 10 మంది పోరంబోకులు ఉండాలి, వారు కూడా అదే రీతిలో వ్యవహరించాలి అప్పుడే ముందుకు వెళ్లగలరు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నేను ఎన్నికలప్పుడే రాజకీయం చేస్తాను. మిగిలిన సమయంలో నన్ను గెలిపించిన ప్రజలకు మంచి చేయాలని తాపత్రయపడుతుంటాను అన్నారు. ఇప్పటివరకు ఏ ఒక్కరి పైన అక్రమ కేసులు బనాయించడానికి నేను ఒప్పుకోలేదు. ఆ విషయంలో నాపై కొంతమంది నాయకులు అసంతృప్తిగా ఉన్నారన్నారు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.