YCP Rebel MLA’s |నెల్లూరు జిల్లా రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. వైసీపీ కంచుకోటగా ఉన్న ఆ జిల్లా ఇప్పుడు టీడీపీకి అడ్డాగా మరబోతోంది. వైసీపీ నుంచి బహిష్కరించబడిన రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే కోటంరెడ్డి టీడీపీ నేతలతో భేటీ అవ్వగా.. అధినేత చంద్రబాబుతో ఆనం భేటీ అయ్యారు. తాజాగా అదే జిల్లాకు చెందిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి యువనేత నారా లోకేశ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేకపాటి, ఆనం రామనారాణరెడ్డి టీడీపీలో చేరబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ ఇస్తే పోటీ చేస్తామని.. ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేస్తామని.. స్పష్టం చేశారు. ఈనెల 13న ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనున్న లోకేష్ పాదయాత్రను విజయవంతం చేస్తామని వెల్లడించారు.
టీడీపీలో చేరనున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు
-