ఇంట్లోకి వెళ్లి తలుపేసుకున్నాడు.. 4 రోజుల తర్వాత చూస్తే..!!

-

Prakasam | ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్న ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే అద్దంకి మండలం జే పంగులూరు గ్రామానికి చెందిన సురేష్ (31) గత రెండు నెలలుగా కనిగిరిలోని ఓ డీఎస్సీ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. అందుకోసం స్థానికంగా ఉన్న ఇందిరా కాలనీ సమీపంలో ఓ ఇంట్లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు.

- Advertisement -

రోజూలానే నాలుగు రోజుల కిందట సురేష్ యధావిధిగా తన ఇంట్లో కి వెళ్లి తలుపు వేసుకున్నాడు. నాలుగు రోజులుగా తలుపు తీయకపోవడం, దుర్వాసన రావడంతో ఆ ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తలుపు పగలగొట్టి చూడగా మృతి చెంది కనిపించాడు. దీంతో కనిగిరి సీఐ పాపారావు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...