తల్లి విజయమ్మకు ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల భావోద్వేగంతో శుభాకాంక్షలు తెలిపారు. “అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. నాకు జన్మనిచ్చి.. ఈ జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి నాకు అండగా, చీకటిలో వెలుగుగా, వేదనలో సాంత్వనగా, విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ రూపం నువ్వు అమ్మ. నీకు ఆ దేవుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను, మనఃశాంతిని, ఆనందాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ.. హ్యాపీ బర్త్‌డే మా” అని ట్వీట్ చేశారు.
షర్మిల ట్వీట్ చేసిన కాసేపటికే సీఎం జగన్ కూడా విజయమ్మకు శుభాకాంక్షలు తెలిపారు. సింపుల్‌గా హ్యాపీ బర్త్‌డే అమ్మ అంటూ ట్వీట్ చేశారు.
రాజకీయ ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. దీంతో విజయమ్మ సపోర్ట్ ఎవరికి ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఆమె మాత్రం ఊహించని విధంగా రాజకీయాలకు దూరంగా అమెరికా వెళ్లిపోయారు. ప్రస్తుతం షర్మిల కుమారుడు, కోడలు, కుమార్తెతో కలిసి అమెరికాలో ఉంటున్నారు.