Ys Jagan Government Ration Distribution Near home: రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకంగా తీసుకున్న ఇంటింటికీ నాణ్యమైన రేషన్ బియ్యం పంపిణీ గురించి మొబైల్ వాహనాల ఆపరేటర్‌ల పై ప్రభుత్వనికి వస్తున్న ఆరోపణలు తరుణంలో వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీధి చివర లేదా పక్క వీధిలో వాహనం ఉంచి రేషన్ బియ్యం ఇచ్చే విధానం కాకుండా వచ్చే నెల నుంచి ప్రతి వాహనం కార్డుదారుడి ఇంటికి వెళ్లి బియ్యం ఇవ్వాలని మొబైల్ వాహనాల ఆపరేటర్‌లకు ఆదేశాలు జారి చేసింది. కాగా.. దీని కోసం ప్రతి మొబైల్ వాహనానికి జీపీఎస్ అమర్చన్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా మండలంలో ఒక వాహనానికి జీపీఎస్ అమర్చనున్నారు. వాహనాలపై వీఆర్ఓ నిఘా ఉంటుందని సమాచారం. అయితే.. చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలో ప్రభుత్వం చౌక డిపోల ద్వారా నాణ్యమైన రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దే అందిచేల రూ.530 కోట్లకు పైగా ఖర్చుతో 9,260 రేషన్ మొబైల్ వాహనాలను కోనుగోలు చేసిన విషయం తెలిసిందే.