వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) గుంటూరు మిర్చి యార్డు ను సందర్శించాడు. రైతుల సమస్యలను అక్కడి రైతులను అడిగి తెలుసుకొని వారిని పరామర్శించారు. రైతులకు ఈ దుస్థితి రావడానికి కూటమి ప్రభుత్వమే కారణమని విమర్శించారు. తమ ప్రభుత్వంలో ప్రతి క్వింటాకు రూ. 21 వేల నుండి 27 వేల వరకు వచ్చేదని.. ప్రస్తుతం 10 వేల నుండి 11 వేలు కూడా రాలేని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడని మండిపడ్డారు. ఓ వైపు పంట దిగుబడి తగ్గిందని.. రైతులు పంటను అమ్ముకునేందుకు బాధపడుతున్నారని అన్నారు.
సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డ్(Guntur Mirchi Yard) లోని రైతుల కష్టాలు, వారు పడుతున్న అవస్థలు చంద్రబాబుకు కనిపించినా కష్టాలపాలు చేస్తున్నాడని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. వైసీపీ(YCP) హయాంలో కల్తీ విత్తనాలు అమ్మాలంటే భయపడేవారు. RBK ని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అందుకే ప్రైవేట్ డీలర్లు ఎరువులను రూ. 500 ఎక్కువగా అమ్ముతున్నారని ఆయన అన్నారు. గతంలో RBK ల ద్వారా నాణ్యమైనవి మాత్రమే సప్లై జరిగేవి కానీ.. ఇప్పుడు ఎందులోనూ క్వాలిటీ అనేది లేదని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు(Chandrababu) కళ్ళు తెరిచి రైతులను ఆదుకోవాలని హెచ్చరించారు.
ఒక ప్రతిపక్ష నాయకుడికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఎన్నికల కోడ్ అని చెప్పి పోలీసు అధికారులు లేకుండా చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మేముకూడా ఇలానే సెక్యూరిటీ తీసేస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు ఆలోచించుకోవాలని జగన్(YS Jagan) విజ్ఞప్తి చేసారు.