రోడ్డు సౌకర్యం లేక బిడ్డ మృతదేహాన్ని మోసుకుంటూ ఓ తండ్రి 8 కిలోమీటర్లు నడిచి వెళ్లిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నారు. తాజాగా ఈ వార్తా కథనాన్ని ట్వీట్ చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల(YS Sharmila) వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
“మీ ఇంటికి, మీ గ్రామానికి మేలు చేస్తేనే ఓటు వెయ్యండి అని అడిగేవాళ్లకు ఈ వార్త చూసైనా కనువిప్పు కలగాలి. ఆరోగ్యశ్రీని అటకెక్కించడంతో ఆసుపత్రిలో సరైన వైద్యం ఎలాగూ అందటంలేదు.. కనీసం చనిపోయిన మృతదేహాన్ని కూడా ఇంటికి చేర్చుకోలేని దుస్థితిలో ప్రజలు ఉన్నారంటే అధికార పార్టీ సిగ్గుపడాలి. మేము అదిచేసాం.. ఇది చేసాం.. అని డబ్బాలు కొట్టుకోవటం కాదు పేదోడి కనీస అవసరాలు తీర్చలేని మీ ప్రభుత్వం ఎందుకు? మళ్లీ మీరు రాజన్న వారసులం అని చెప్పుకుంటారు? ఇలానే ఉంటుందా రాజన్న పాలనా? అందుకే చెబుతున్నాం ఓటు అనే ఆయుధంతో వీళ్లకు బుద్ది చెప్పండి” అని షర్మిల(YS Sharmila) ట్వీట్ చేశారు.