YS Sharmila | అన్న లాంటి వారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారు.. షర్మిల

-

అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి ఐదో వర్థంతి సందర్భంగా కడపలో శుక్రవారం నిర్వహించిన స్మారక సభలో షర్మిల, మరో సోదరి సునీత పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ “చిన్నాన్న వైఎస్ వివేకా మరణంతో ఎక్కువగా నష్టపోయింది చిన్నమ్మ సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె సునీత. బాధితులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటివరకూ హత్య చేసిన, చేయించిన వారికి శిక్ష పడలేదు. చిన్నాన్న చివరి క్షణం వరకూ వైసీపీ కోసమే పని చేశారు. అలాంటి వ్యక్తిపై నిందలు వేస్తారా.?. సాక్షిలో పైన వైఎస్ ఫోటో.. కింద ఆయన తమ్ముడి వ్యక్తిత్వంపై నిందలు వేశారు. జగనన్నా.. అద్దం ముందు నిల్చొని ప్రశ్నించుకోండి. మీ మనస్సాక్షి ఏం చెబుతుందో వినండి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన తోబుట్టువుల కోసం ఏం చేశారో మీకు తెలియదా.? ఆయన వారసుడిగా మీరేం చేశారు’ అంటూ వాపోయారు.

“సునీత కుటుంబం హత్య చేసి ఉంటే మీరు ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదు.? ప్రభుత్వం మీదే ఉంది కదా.. డాక్టర్‌గా సునీతకు ఓ స్థానం ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఓ పేరు ఉంది. సునీతకు, చిన్నమ్మకి ఈరోజు మాట ఇస్తున్నాను. ఎవరు ఉన్నా లేకున్నా… వైఎస్సార్ బిడ్డ మీకు అండగా ఉంటుంది. సునీత పోరాటానికి నేను బలం అవుతా. ఇది ఆస్తి, అంతస్తు కోసం కాదు. న్యాయం జరగాలని కొట్లాడుతున్న ఓ బిడ్డ కోసం పోరాటం. ప్రజలంతా న్యాయం పక్షాన నిలబడాలి”అంటూ షర్మిల పిలుపునిచ్చారు.

ఇక వివేకా కుమార్తె సునీత మాట్లాడుతూ “వివేకానందరెడ్డి మనకి దూరమై ఐదేళ్లయింది. ఆయనకు అంత కీడు ఎలా తలపెట్టారని ఆలోచిస్తున్నప్పుడే జగనన్న సీఎం అయ్యారు. ప్రజలందరికీ న్యాయం చేస్తానని ప్రమాణస్వీకారం చేశారు. జగనన్నను ఒక ప్రశ్న అడుగుతున్నా.. అంతఃకరణశుద్ధిగా అంటే అర్థం తెలుసా? వివేకాను చంపిన వారికి, చంపించిన వారికి శిక్ష పడేలా చేయాల్సిన బాధ్యత మీకు ఉంది. ఇప్పటివరకూ హంతకులకు శిక్షపడేలా ఎందుకు చేయలేదు? మీ ప్రమాణాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదు? తండ్రిపోయిన బాధలో తల్లడిల్లుతున్న కుమార్తె ఒకవైపు ఉన్నారు.. చంపినవాళ్లు, చంపించినవాళ్లు, వాళ్లను కాపాడుతున్న వాళ్లు మరోవైపు ఉన్నారు.

ప్రజలారా.. మీరు ఎటువైపు ఉంటారు? దిగ్భ్రాంతిలో ఉండిపోతారా? మీకు స్పందించే అవకాశం వచ్చింది.. స్పందించండి. వైసీపీ పునాదులు వివేకా, కోడికత్తి శ్రీను రక్తంలో మునిగి ఉన్నాయి. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీ భవిష్యత్‌ కోసం బయటకు రండి. రాకపోతే ఆ పాపం మీకు చుట్టుకుంటుంది. ప్రభుత్వంలో ఉండి మాపై ఆరోపణలు చేయడమేంటి? సాక్షి పత్రికలో మాపై నిందలు వేస్తూ వార్తలు రాస్తున్నారు. సాక్షి ఛైర్‌పర్సన్‌ భారతికి ఓ విన్నపం. మీ వద్ద ఆధారాలుంటే సీబీఐకి ఇవ్వండి. అన్నం పెట్టిన చేతిని నరకడం.. వ్యక్తిత్వం మీద బురద జల్లడం దారుణం. మాపై నిందలు వేసినా.. సీతాదేవిలా నిర్దోషిత్వం నిరూపించుకుంటాం. మీ కోసం నిరంతరం పని చేసిన వివేకాను మర్చిపోయారా?” అని సునీత ఆవేదన వ్యక్తంచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....