YS Sharmila – YS Jagan | జైలుకెళ్లి నేరస్థులను పలకరించే సమయం ఉంటుంది కానీ, ప్రజల పక్షాన అసెంబ్లీ తమ గళాన్ని వినిపించాల్సిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి దమ్ములేదని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాలను ప్రశ్నిస్తారని ప్రజలు వైసీపీ(YCP) నుండి 11 మంది ఎమ్మెల్యే లను గెలిపిస్తే.. అసెంబ్లీ కి రాకుండా మారం చేసే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కి, పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజల మధ్య తిరిగే అర్హత లేదని అన్నారు. పాలక ప్రభుత్వాన్ని అసెంబ్లీ లో ప్రశ్నించే తీరిక దొరకని జగన్ కి.. ప్రెస్ మీట్ లు పెట్టి పురాణం అంతా చెప్పే సమయం దొరుకుతుందా అని మండిపడ్డారు. ప్రజల సమస్యలపై మాట్లాడే నైతికత వైసీపీ కి కోల్పోయిందని ఆమె అన్నారు. ఈసారైనా వైసీపీ ఎమ్మెల్యే లు అసెంబ్లీ కి వెళ్లాలని డిమాండ్ చేసారు. సభా వేదికగా కూటమి ప్రభుత్వ(NDA) వైఫల్యాలను ఎండగట్టాలి. ఈ సారి కూడా అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామాలు చేయాలనీ షర్మిల(YS Sharmila) కోరారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను(Super Six Guarantees) ఇకనైనా అమలు చేయాలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు డిమాండ్ చేసారు. ఏపీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 ప్రారంభం కానున్న నేపథ్యంలో X వేదికగా ఆమె కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. సీఎం చంద్రబాబు(Chandrababu) సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాప్. పథకాల అమలు ఎప్పుడు అని అడిగితే 9 నెలల్లో 90 కారణాలు చెప్పారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలపై , సూపర్ సిక్స్ పథకాలపై మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని షర్మిల కోరారు. ఈనెల 28న ప్రవేశపెట్టే బడ్జెట్ లో సూపర్ సిక్స్ పథకాలకు అగ్రభాగం నిధులు కేటాయించండి. అన్ని పథకాలను ఈ ఏడాది నుంచే అమలు చేసి ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకోవాలంటూ హితవు పలికారు.