YS Sharmila | కంటతడి పెట్టిన వైఎస్ షర్మిల.. ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు.. 

-

వ్యక్తిగత కారణాలతో ఏపీ రాజకీయాల్లోకి రాలేదని.. ప్రత్యేక హోదా ఇస్తానని రాహుల్ గాంధీ చెప్పడంతోనే రాజకీయాల్లోకి వచ్చానని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల కంటతడి పెట్టుకున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజాన ఎత్తుకున్నది కాంగ్రెస్ పార్టీ అని.. ఉద్యమం ఉవ్వెత్తున జరగకపోతే మనకు హోదా రాదన్నారు. ప్రత్యేక హోదా- ఆంధ్రుల హక్కు అని నినదించారు. హోదా వచ్చి ఉంటే రాజధాని, పోలవరం మనం కట్టుకోలేమా? పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం ఎందుకు తక్కువగా ఉండాలి? అని ఆమె ప్రశ్నించారు.

- Advertisement -

“మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిది.. హోదాను సాధించుకోవాలి అంటే మనం ఉద్యమించాలి. ప్రత్యేక హోదా ఉద్యమం భుజాన వేసుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు చెప్పినట్టు గొర్రెల్లాగా ఉండొద్దు.. సింహాల్లా పోరాడాలి. చంద్రబాబును, జగన్‌ను నమ్ముకుని పదేళ్లుగా గొర్రెల్లాగా ఉన్నాం, ఇక నుంచి అయినా సింహాల్లాగా గర్జించాలి. ప్రత్యేక హోదా కోసం మనం సింహాల్లా పోరాడి సాధించుకోవాలి .. అవసరమైతే లాక్కోవాలి.. ప్రతి కాంగ్రెస్ నేత, కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి బీజేపీ, వైసీపీ, టీడీపీ చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని పిలుపునిస్తున్నా. బీజేపీతో వారు చేస్తున్న చీకటి పొత్తులను ప్రజలకు వివరించాలి. ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఆ మాటతోనే నేను ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టాను” అని షర్మిల తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...