YS Sharmila: చెల్లి షర్మిల అరెస్ట్‌.. హైదరాబాద్‌కు సీఎం జగన్‌?

-

YS Sharmila has been arrested by the police: వైఎస్ఆర్‌‌టీపీ అధినేత్రి, సీఎం జగన్‌ చెల్లి వైయస్‌ షర్మిల అరెస్టు అయిన విషయం తెలిసిందే. చెల్లి అరెస్టు గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌.. చెల్లిని కలిసేందుకు హైదరాబాద్‌కు రానున్నట్లు వైఎస్‌ఆర్‌ నేతలు చెప్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. తన కుమార్తెను చూసేందుకు ఎస్‌ ఆర్‌ గర్‌ పోలీస్‌ స్టేషన్‌కు బయలుదేరుతుండగా, వైయస్‌ విజయమ్మను లోటస్‌ పాండ్‌లోనే హౌస్‌ అరెస్ట్‌ చేశారు. తన కుమార్తెను చూడటానికి వెళ్లటం కూడా తప్పేనా అంటూ విజయమ్మ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. హౌస్‌ అరెస్టుకు నిరసనగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు విజయమ్మ. షర్మిల అరెస్టుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల స్పందించారు. షర్మిల (YS Sharmila) అరెస్ట్‌ వ్యక్తిగతంగా బాధాకరమని సజ్జల రామకృష్ణ అన్నారు. వైఎస్‌ఆర్‌టీపీ తెలంగాణలో ఉందనీ.. రాజకీయపరమైన విధానలపై ఆమె తీసుకునే నిర్ణయాలపై మీడియా అడగటం, తాను స్పందించటం సరికాదని స్పష్టం చేశారు

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...