YS Sharmila | తల్లి ఆశీస్సులతో ప్రచారానికి బయలుదేరిన షర్మిల

-

ఏపీలో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. కడప ఎంపీగా పోటీ చేస్తున్నా పీసీసీ ఛీప్ వైయస్ షర్మిల(YS Sharmila) అక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ప్రచారానికి బయలుదేరే ముందు తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకున్నారు.

- Advertisement -

“దేవుడి దీవెనలతో, నాన్న ఆశీర్వాదంతో, అమ్మ ప్రేమతో, చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నాను.. మీ రాజన్న బిడ్డను దీవించాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ ఎన్నికల శంఖారావం పూరించనున్నాను. న్యాయం కోసం పోరాడుతున్న ఈ యుద్ధంలో మీ ఆశీస్సులు నాపై ఉంటాయని ఆశిస్తున్నాను” ఆమె ట్వీట్ చేశారు.

శుక్రవారం నుంచి కడప పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ రూపొందించారు. ఏప్రిల్ 12వరకు కడప జిల్లాలో షర్మిల(YS Sharmila) ప్రచారం సాగనుంది. అనంతరం మిగతా జిల్లాల్లో ప్రచారం చేయనున్నారు. ఈ ప్రచారానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర జాతీయ నేతలు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Read Also: వైసీపీకి మరో షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...