కాంగ్రెస్ పార్టీలో YSRTPని విలీనం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. జనవరి 4వ తేదీ ఉదయం 11 గంటలకు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge), రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ల సమక్షంలో వైయస్ షర్మిల(YS Sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో జరిగిన వైఎస్‌ఆర్‌టీపీ భేటీలో షర్మిల కీలక ప్రకటన చేశారు. ఈ సమావేశంలో ఏపీ కాంగ్రెస్‌లో ఏ బాధ్యతలు స్వీకరించబోతున్నారని పార్టీ నేతలు ప్రస్తావించగా.. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నానని షర్మిల తెలిపారు. సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల.. ఒకటి రెండు రోజుల్లో అన్ని విషయాలు తానే స్వయంగా చెబుతానంటూ వెల్లడించారు.
షర్మిల(YS Sharmila)తో పాటు 40 మంది నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. దీంతో ఆ నేతలు ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న కీలక నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. మొత్తానికి షర్మిల రాకతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మరోవైపు షర్మిల కుటుంబసమేతంగా ఇవాళ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించనున్నారు. కుమారుడు వైయస్ రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను ఘాట్ దగ్గర ఉంచి తండ్రి ఆశీస్సులు తీసుకోనున్నారు.