సీఎం జగన్ మానసిక స్థితి గురించి భయం వేస్తోంది: షర్మిల

-

సీఎం జగన్ మానసిక స్థితి గురించి తనకు భయం వేస్తోందని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల(YS Sharmila) తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో తాను చేతులు కలిపానని ఏ ఆధారాలతో చెబుతున్నారు అంటూ నిలదీశారు. చంద్రబాబుతో ఈ వైఎస్సార్ బిడ్డ చేతులు కలిపినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. జగన్‌కు చంద్రబాబు పిచ్చి పట్టుకున్నట్టుందని విమర్శించారు.

- Advertisement -

“చంద్రబాబు చెబితే నేను కాంగ్రెస్ లో చేరానని అంటున్నారు. మరి ఆనాడు చంద్రబాబు చెబితేనే జగన్(YS Jagan) కోసం పాదయాత్ర చేశానా? సునీత కూడా చంద్రబాబుతో చేతులు కలిపారని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు మాట వింటారని చెబుతున్నారు. చంద్రబాబు ఎంతో పవర్ ఫుల్ అని చెబుతున్నారు… ఏం జరిగినా చంద్రబాబే కారణమని అంటున్నారు. జగన్‌కు చంద్రబాబు పిచ్చి పట్టుకున్నట్టుంది.

జగన్ మానసిక స్థితి గురించి నాకు భయం వేస్తోంది… అద్దంలో చూసుకుంటే జగన్ కు చంద్రబాబు(Chandrababu) ముఖమే కనబడుతోందా? అందుకే జగన్ కు ఓ అద్దం పంపుతున్నా. ఈ అద్దంలో జగన్ తనను తాను చూసుకోవాలి. అద్దంలో తానే కనిపిస్తున్నారో, చంద్రబాబు కనిపిస్తున్నారో చెప్పాలి” చెప్పాలన్నారు .

అలాగే “కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా మరోసారి చెబుతున్నాను. రాజశేఖర్ రెడ్డి పేరుని కాంగ్రెస్ పార్టీ సీబీఐ ఛార్జిషీటులో చేర్చలేదు. పొన్నవోలు సుధాకర్ పట్టుబట్టి చేర్చారు. అయితే ఇప్పుడు నేను మాటలు మార్చినట్టుగా పొన్నవోలు నా పాత వీడియోలను వెతికి మరీ చూపిస్తున్నారు. నన్ను ఊసరవెల్లిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ రోజు నిజం తెలియక మేము అలా మాట్లాడాం. ఈ రోజు నిజం తెలిసింది కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నాం. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మొన్న సోనియా గాంధీ గారిని కలిస్తే ఆ విషయాన్ని ఆమె స్పష్టంగా చెప్పారు. నేను పెట్టలేదని అన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇదే చెప్పారు. పొన్నవోలు సుధాకర్ మూడు కోర్టులకు తిరిగి రాజశేఖర్ రెడ్డి గారి పేరు చేర్చించారని ఆయన చెప్పేదాకా నాకు తెలియదు’’ అని షర్మిల(YS Sharmila) స్పష్టంచేశారు.

Read Also: హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...