YS Sharmila | ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ

-

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం జగన్‌కు ‘నవ సందేహాల’ పేరుతో మరో లేఖ రాశారు. బుధవారం ఎస్సీ, ఎస్టీల గురించి ఓ లేఖ రాయగా.. తాజా లేఖలో ఉద్యోగాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. ఎన్నికల వేళ వరుస లేఖలతో వైసీపీ ప్రభుత్వాన్ని షర్మిల ఇరకాటంలో పెడుతున్నారు.

- Advertisement -

లేఖలో లేవనెత్తిన ప్రశ్నలు..

  1. 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.. ఏమైంది.?

  1. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎందుకు ఇవ్వలేదు.?

  1. గ్రూప్ – 2 కింద ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు భర్తీ చేయలేదు?

  1. 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఏం చేశారు.?

  1. వర్శిటీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదు.?

  1. 23 వేలతో మెగా డీఎస్సీ అని 6 వేలతో దగా డీఎస్సీ ఎందుకు వేశారు.?

  1. నిరుద్యోగులు 7.7 శాతం పెరిగారంటే మీ వైఫల్యం కాదా.?

  1. యువత ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు ఎందుకు పోతున్నారు.?

  1. ప్రస్తుతం జాబ్ రావాలంటే మీ పాలన పోవాలి అని అంగీకరిస్తారా.?

ఇదిలా ఉంటే కడప ఎంపీగా షర్మిల(YS Sharmila) పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు వైసీపీ అభ్యర్థిగా అవినాశ్ రెడ్డి బరిలో దిగారు. దీంతో అక్కడ పోరు నువ్వా నేనా రీతిలో ఉంది. మరి వీరిలో ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే జూన్ 4వరకు వేచి చూడాల్సిందే.

Read Also: ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...