నీకిది తగునా..? సీఎం జగన్‌కు వివేకా సతీమణి లేఖ..

-

ఎన్నికల వేళ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా సీఎం జగన్‌కు వివేకా సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న సొంత చెల్లెళ్లపై నిందలు వేస్తూ హేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

“2009లో జగన్‌ తన తండ్రిని కోల్పోయినప్పుడు మనోవేదన అనుభవించారని.. 2019లో సునీత కూడా తన తండ్రిని పోగొట్టుకుని అంతే మనోవేదన అనుభవించారు. అంతేకాకుండా మన కుటుంబంలోని వారే హత్యకు కారణం కావడం మరింత బాధపెట్టింది. నీ పత్రిక, టీవీ ఛానల్‌, పార్టీ వర్గాలు తీవ్రరూపంలో మాట్లాడారు. చెప్పలేనంత విధంగా వ్యక్తిత్వ హననం చేయించడం నీకు తగునా. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నపై నీ సొంత మీడియా, పార్టీ వర్గాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి’ అంటూ వాపోయారు.

న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్లను హేళన చేస్తూ నిందలు మోపుతున్నారు. కొంతమంది దాడులకూ తెగబడేస్థాయికి దిగజారుతున్నా నీకు పట్టడం లేదా? సునీతకు మద్దతుగా నిలిచి పోరాడుతున్న షర్మిలనూ టార్గెట్‌ చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉండటమేంటి?. కుటుంబసభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదేనా నీ కర్తవ్యం? ఇంకా బాధించే అంశం.. హత్యకు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం కల్పించడం. ఇది సమంజసమా..? ఇలాంటి దుశ్చర్యలు నీకు ఏమాత్రం మంచిది కాదు. హత్యకు కారకుడైన నిందితుడు నామినేషన్‌ దాఖలు చేశాడు. చివరి ప్రయత్నంగా ప్రార్థిస్తున్నా. రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిగా.. న్యాయం, ధర్మం, నిజం వైపు నిలబడాలని వేడుకుంటున్నా” అంటూ లేఖలో వెల్లడించారు.

అంతకుముందు పులివెందులలో నామినేషన్ వేసిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వైఎస్ షర్మిల, సునీత రెడ్డిలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివేకాకు రెండో భార్య ఉన్నది వాస్తవం కాదా? అవినాష్‌రెడ్డి ఏ తప్పు చేయలేదు.. అవినాష్‌ రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నారు. వివేకాను చంపిన నిందితుడికి మద్ధతిస్తుంది ఎవరు? పసుపు మూకల కుట్రలో చెల్లెళ్లు భాగమయ్యారు. పసుపు చీరలు కట్టుకుని వైఎస్సార్‌ శత్రువులతో చేతులు కలిపిన వీళ్లా వైఎస్సార్‌ వారసులు” అంటూ ఆరోపణలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...