మాజీ మంత్రి వివేకా హత్య కేసు(Viveka Murder Case)లో రోజుకో ట్విస్టు వెలుగుచూస్తోంది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి(YS Avinash Reddy)కి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేకా కూతురు సునీతారెడ్డి(Sunitha Reddy) సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని సునీత తరపు లాయర్ విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం రేపు విచారణ చేపడతామని తెలిపింది.
మరోవైపు ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన అవినాశ్ తండ్రి భాస్కరరెడ్డి(YS Bhaskar Reddy), ఉదయకుమార్ రెడ్డి(Uday Kumar Reddy)లు తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఈ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేకుండానే సీబీఐ అరెస్ట్ చేసిందని పిటిషన్ లో పేర్కొన్నారు. తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయాలని భాస్కరరెడ్డి కోరారు. కాసేపట్లో ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. అటు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో వీరిద్దరితో పాటు అవినాశ్ రెడ్డి(YS Avinash Reddy)ని అధికారులు వేర్వేరుగా విచారిస్తున్నారు.
Read Also: చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెప్పిన వైసీపీ కీలక నేతలు
Follow us on: Google News, Koo, Twitter