Union Budget 2024 | దేశంలోని రైతులకు కేంద్రం ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రైతులు, యువతకు బడ్జెట్‌లో భారీ ప్రకటనలు చేశారు. వ్యవసాయ రంగానికి రూ.1.52 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ప్రకటించారు. ఉత్పాదకత, వాతావరణాన్ని తట్టుకునే 9రకాల వంగడాలను పెంచడంపై దృష్టి సారించేలా వ్యవసాయ పరిశోధన రూపాంతరం చేందుతుందని చెప్పారు. వాత అందుకోసం వ్యవసాయ పరిశోధన సెటప్‌ను సమగ్రంగా సమీక్షించాలని కూడా అన్నారు. ఈ నిధులతో వ్యవసాయం, సంబంధిత రంగాలకు పథకాలు రూపొందించనున్నట్లు ప్రకటించారు.
Union Budget 2024 | రైతులకు ఉన్న కష్టాలను తీర్చే దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. రైతాంగం బలోపేతానికి, అభివృద్ధికి కృషి చేస్తామని, వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించి రైతులకు అధిక లాభాలు వచ్చేలా చేస్తామని అన్నారు. భారతదేశాన్ని అన్ని రంగాల్లో నెంబర్ వన్ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.