Union Budget 2023: యావత్ ప్రపంచం భారత్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ వైపు చూస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం ఉదయం బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణంలో మీడియాతో మాట్లాడిన మోడీ. అందరి ఆకాంక్షలు నెరవేర్చేలా ఆర్థిక మంత్రి బడ్జెట్ రూపొందించారని భావిస్తున్నాన్నారు. భారత రాష్ట్రపతి ముర్ము మొదటిసారి పార్లమెంట్ లో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్న నేపథ్యంలో ఇది గిరిజనులకు ఎంతో గర్వకారణమైన రోజు అని అభిప్రాయపడ్డారు. అలాగే మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మహిళే అని అన్నారు. ‘ఇండియా ఫస్ట్, సిటిజెన్ ఫస్ట్’ అనే నినాదంతో ఈ సారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాన్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. సమావేశాలు సజావుగా సాగేలా విపక్షాలు సహకరించాలని కోరారు.