ఈ పబ్ అంతా డబ్బులతో నిండిపోయింది – వరల్డ్ ఫేమస్ పబ్

World Famous Pub special story

0
283

షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, క్లబ్స్, పబ్స్, కెఫేలు తమ దగ్గరకు వచ్చే కస్టమర్లను ఆకట్టుకునేందుకు అనేక రకాల ఆఫర్లు ఇస్తూ ఉంటాయి. అంతేకాదు పబ్స్ అయితే మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతారు.
ఫ్లోరిడాకు చెందిన ఓ పబ్ యాజమాన్యం ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఎవరూ చేయని సాహసం వీరు చేశారు. అంత అద్భుతంగా ఇంటీరియర్ మార్చారు. ఇక్కడ స్పెషాలిటీ ఏమిటి అంటే పబ్ లో అడుగుపెట్టగానే గోడలపై డాలర్లు కనిపిస్తాయి.

వీటి విలువ కేవలం వందలు, వేలు కాదండోయ్.. ఏకంగా రూ.కోట్లలో ఉంటుంది. మరి దేనికి వీరు ఇంతలా డెకరేట్ చేశారు, ఏమిటి దీని స్పెషాలిటీ అంటే తెలుసుకుందాం. ఫ్లోరిడాలోని పెన్సాకోలా ప్రాంతంలో మెక్ గైర్ దంపతులు 1977లో మెక్గైర్స్ ఐరిష్ పబ్ను స్టార్ట్ చేశారు. ఇక పెట్టిన కొత్తలోనే కస్టమర్లను బాగా ఆకట్టుకునేది.

ఇక మైక్ గైర్స్ దంపతుల సర్వీసు చూసి ఓ వ్యక్తి వారికి ఓ డాలర్ టిప్పు ఇచ్చాడు.
దానిని గుర్తు ఉంచుకునేలా ఆ డాలర్ నోట్పై తేదీ రాసి బార్ టేబుల్కు అతికించింది అతని భార్య . ఇలా పబ్ కు వచ్చిన ప్రతీ టిప్ డాలర్ పై వారి పేరు రాసి అతికించేవారు. మొత్తం టేబుల్స్ నిండిపోవడంతో ఇప్పుడు సీలింగ్కు వేలాడదీశారు. దాదాపు ఈ పబ్ లో మొత్తం 2 మిలియన్ యూఎస్ డాలర్లు ఉంటుంది. ఇక దొంగలు కూడా ఎవరూ దొంగిలించరు. ఎందుకంటే ఈ నోటుపై బ్లాక్ లెటర్స్ సైన్ ఉంటుంది. అలాగే డాలర్ పై లెఫ్ట్ సైడ్ హోల్ ఉంటుంది. ఈ నోట్లను ఎవరైనా బయట షాపుల్లో ఇస్తే వెంటనే వారిపై కేసు పెడతారు.