లావు తగ్గడం లేదని 100 మందిని ఉద్యోగం నుంచి తీసేశారు

100 members of Employed were removed for not losing their weight

0
73

వినడానికి ఆశ్చర్యంగా ఉందా ? అవును ఓ కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఉద్యోగం నుంచి తీసేసింది. ఇస్లామాబాద్ లో ఉద్యోగం లో చేరిన తర్వాత లావయ్యారంటూ కొందరిని ఉద్యోగం నుంచి తీసేసింది పాకిస్తాన్ కు చెందిన ఎయిర్లైన్స్ సంస్థ.

ఈ ఎయిర్లైన్స్ సంస్థ 140 మందిని విధుల నుంచి తొలగించింది. లావు తగ్గించుకోవాల్సిందిగా ఇప్పటికే ఆ ఉద్యోగులకు చెప్పింది. నోటీసులు ఇచ్చింది. అయినా వారు మారలేదు. దీంతో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

అందుకే వారిని విధుల నుంచి తొలగించామని సంస్థ వెల్లడించింది. ఈ 100 మందిని జులై నెలకు సంబంధించి ఫ్లైట్ డ్యూటి రోస్టర్ లిస్ట్ నుంచి తీసివేసింది. అయితే చాలా మంది సిబ్బంది ఈ ఎయిర్ లైన్స్ పై మండిపడుతున్నారు. కానీ కొందరు మాత్రం ఇది మంచి నిర్ణయమే అంటున్నారు.ఎయిర్లైన్స్ ఉద్యోగాలు చేసే వారు తప్పనిసరిగా నాజూగ్గానే ఉండాలి అని సలహా ఇస్తున్నారు.