ఎస్‌బీఐలో 1126 సీబీఓ పోస్టులు..పూర్తి వివరాలివే..

1126 CBO posts in SBI..full details ..

0
99
SBI

భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (SBI) సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈనెల 29 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1226 పోస్టులను భర్తీ చేస్తుంది. ఒక్కరు ఒక్క రాష్ట్రంలోని పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని షరతు విధించింది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

మొత్తం పోస్టులు: 1226
ఇందులో 126 బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఉన్నాయి.

అర్హత: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 21 నుంచి 30 ఏండ్ల మధ్య లేదా 1991, డిసెంబర్‌ 2 నుంచి 2000, డిసెంబర్‌ 1 మధ్య జన్మించినవారై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్‌ రాతపరీక్ష, స్క్రీనింగ్‌, ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

అప్లికేషన్‌ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్‌ 29

వెబ్‌సైట్‌: https://ibpsonline.ibps.in/