జంతువులకు ఎవరైనా ఉద్యోగం ఇస్తారా? కానీ మీరు నమ్మి తీరాల్సిందే. ప్రఖ్యాత సెర్చ్ఇంజిన్ సంస్థ గూగుల్ ఎక్కడాలేని విధంగా తొలిసారి ఓ జంతువుకు ఉద్యోగం ఇచ్చింది. మరి ఆ జంతువేంటి? ఈ ఆశ్చర్యకర సంఘటన ఎప్పుడు జరిగింది?
గూగుల్ లాంటి సంస్థలో ఉద్యోగం కోసం ఎంతోమంది యువత కలలు కంటారు. గూగుల్లో ఉద్యోగానికి అంతపోటీ ఉంటుంది. కానీ ఆ సంస్థ తొలిసారిగా ఓ జంతువుకు ఉద్యోగం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. అవును..’రఫియా’ అనే ఒంటెకు 2014లో ఉద్యోగం కల్పించింది గూగుల్.
ఒంటెలు సాధారణంగా ఎడారిలో ప్రయాణిస్తుంటాయి. అలా రఫియా ఎడారిలో ప్రయాణించేటప్పుడు దానికి కెమెరాలు అమర్చారు. అది ఎడారిలో తిరుగుతూ..360 డిగ్రీల కోణంలో ఎడారి అందాలను చిత్రీకరించింది. అత్యంత ఉష్ణ్రోగత ఉన్న ఎడారి ప్రాంతంలో ఇలా చిత్రాలను తీయటం మనుషులకు కష్టతరం కాబట్టి ఆ ఒంటెను ఉద్యోగిగా గూగుల్ నియమించుకుందట.