కస్టమర్లకు Airtel అదిరిపోయే ప్లాన్స్

Airtel Creepy Plans for Customers

0
133

భారత టెలికం సంస్థలు కొత్త ఆఫర్లతో కస్టమర్లని ఆకట్టుకుంటున్నాయి. ఇక చాలా మంది సరికొత్త ప్లాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. వారి కోసం కొత్త ప్లాన్స్ ఎప్పటికప్పుడు సంస్దలు తీసుకువస్తున్నాయి. ఎయిర్టెల్ భారత్లో వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. ఫైబర్ నెట్, డీటీహెచ్, మొబైల్ సర్వీసులను ఒకే గొడుగు కిందకి తెచ్చింది అని చెప్పాలి. నిజమే ఈ ప్లాన్స్ వింటే మీరు అదే అంటారు. సో ఇంకెందుకు ఆలస్యం అవేంటో చూద్దాం.

1. ఒక ప్లాన్ ద్వారా కస్టమర్లు రెండు లేదా అంతకంటే ఎక్కువ కనెక్షన్స్ పొందవచ్చు.

2. కస్టమర్లకు నచ్చిన విధంగా ప్లాన్స్ తీసుకోవచ్చు

3. ఫైబర్ రూ.499, డీటీహెచ్ రూ. 153, మొబైల్ రూ.499 నుంచి ప్లాన్స్ మొదలు అవుతాయి.

4. మీరు రూ.1598 ప్లాన్ తో రెండు మొబైల్స్, ఒక ఫైబర్ నెట్ వాడుకోవచ్చు.

5. అలాగే మీరు రూ.1349 ప్లాన్ తో మూడు మొబైల్స్, ఒక డీటీహెచ్ ని వాడుకోవచ్చు

6. అలాగే రూ.2,099 ప్లాన్ కింద మూడు మొబైల్స్, ఒక ఫైబర్, ఒక డీటీహెచ్ కనెక్షన్ వాడుకోవచ్చు.

ఇక మీరు ఎలాంటి ఇన్ స్టాలేషన్ చార్జీలు ఇవ్వక్కర్లేదు. ఈ ప్లాన్స్ కి జీఎస్టీ అదనంగా చెల్లించాలి. అంతేకాదు సర్వీస్ చార్జీలు లేవు.