Flash: దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఎయిర్ టెల్ సేవలు

Airtel services suspended across the country.

0
87

దేశవ్యాప్తంగా ఎయిర్ టెల్ సేవలకు తీవ్ర అంతరాయం నెలకొంది. ఇవాళ ఉదయం 11 గంటల సమయం నుంచి.. బ్రాడ్ బాండ్, వైఫై అలాగే మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ఎయిర్టెల్ కస్టమర్ లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఈ తరుణంలో స్వయంగా ఎయిర్టెల్ సంస్థ ఈ సమస్యపై  స్పందించింది. తమ కస్టమర్లకు క్షమాపణలు కూడా చెప్పింది. “మా ఇంటర్నెట్ సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది మరియు దీని వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి మేము తీవ్రంగా చింతిస్తున్నాము. మా కస్టమర్‌లకు అతుకులు లేని అనుభవాన్ని అందించడానికి మా బృందాలు పని చేస్తూనే ఉన్నందున, ఇప్పుడు అన్ని సేవలు నడుస్తాయి.” అంటూ ట్వీట్‌ చేసింది.