Alert: మీరు ఏటీఎం వాడుతున్నారా? ఇవి తప్పక పాటించాల్సిందే..ఎస్బీఐ సూచనలివే..

Alert for ATM users .. SBI must comply with these ..

0
90

రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న మన ఖాతా ఖాళీనే. అంతలా రెచ్చిపోతున్నారు కేటుగాళ్లు. అయితే ఎన్ని చర్యలు తీసుకున్న వారి ఆగడాలను ఆపలేకపోతున్నాం. వారి ఆగడాలకు ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎప్పటికప్పుడు తన కస్టమర్లకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ ఉంటుంది. తాజాగా ఎస్బీఐ తన ఖాతాదారులకు ఏటీఎం కేంద్రాల్లో మోసాల నివారణకు పలు సూచనలు చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏటీఎం కార్డును మిషన్ లో సరిగా ఉంచామా? లేదా? అన్నది పరిశీలించాలని బ్యాంక్ సూచించింది. ఏపీఎం కేంద్రాల్లో ఏమైనా అనుమానాస్పద పరికరాలు ఉన్నాయా? లేవా? అన్నది పరిశీలించాలి.

ఖాతాదారులు ఏటీఎం కేంద్రాల్లో లావాదేవీలు నిర్వహిస్తున్న సమయంలో చుట్టుపక్కల పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలి.

ఏటీఎం మిషన్ లో పిన్ నమోదు చేసే సమయంలో మీ కీబోర్డ్ ను చేతితో కవర్ చేసి ఉండాలి. ఎవరూ మీ పిన్ ను చూడకుండా జాగ్రత్త వహించాలి.

ఏటీఎం పిన్ ను కాలానుగుణంగా మార్చుతూ ఉండాలని బ్యాంక్ ఖాతాదారులకు సూచించింది.

ఇంకా ఖాతా స్టేట్ మెంట్ ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి.