ఈపీఎఫ్ఓ యూజర్లకు అలర్ట్..ఈ తప్పులు చేస్తున్నారా!

0
275

యూజర్లను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) అలర్ట్ చేస్తోంది. ఎట్టి పరిస్థితిలో ఇలాంటి  తప్పులు చెయ్యద్దని చెప్తుంది. కనుక ఈపీఎఫ్ఓ యూజర్స్ వీటిని గమనించాలి. అసలు విషయం ఏంటంటే తమ అకౌంట్లకు సంబంధించిన సమాచారాన్ని అస్సలు షేర్ చేసుకోవద్దని చెప్పడం జరిగింది.

ఒకవేళ అలా చేస్తే అనవసరంగా భారీగా నష్టపోవాల్సి ఉంటుందని తెలిపింది. ఒకవేళ  సైబర్ మోసగాళ్ల చేతికి ఈ ఈపీఎఫ్ అకౌంట్ సమాచారం కనుక అందితే అప్పుడు అకౌంట్ లో డబ్బులు ఖాళీ అయ్యిపోతాయని అంది. కనుక తమ అకౌంట్లకు సంబంధించిన సమాచారాన్ని అస్సలు షేర్ చేసుకోద్దు. అదే విధంగా ఈపీఎఫ్ఓ ఎట్టిపరిస్థితుల్లో మీ ఆధార్, పాన్, యూఏఎన్, బ్యాంకు వివరాలను అడగదని.. ఎవరైనా ఆ వివరాలను అడిగారంటే చెప్పద్దని అంది.

ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియా ద్వారా మీ సమాచారం బయటికి రాకుండా చూసుకోవాల్సి ఉందని కూడా అంది. ఈ విషయంపై తన యూజర్లకు ట్విటర్ ద్వారా హెచ్చరిస్తోంది ఈపీఎఫ్ఓ. ఒక ట్వీట్ కూడా చేసింది. అలానే వాట్సాప్, సోషల్ మీడియా సర్వీసుల ద్వారా మనీని డిపాజిట్ చేయమని కూడా చెప్పేసింది. ఉద్యోగులు జాబ్ మారేటప్పుడు ఈ మోసాలు చేస్తున్నారని.. జాగ్రత్తగా వ్యవహరించమని తెలిపింది.