బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ ను తీసుకొస్తుంది. ఇప్పటికే కస్టమర్లకు వీలైనన్ని సౌకర్యాలు ఆన్ లైన్ లోనే ఉండేలా చేస్తూ సేవలను విస్తరిస్తుంది. తాజాగా మరో కొత్త రూల్ ను తీసుకొచ్చింది ఎస్బిఐ. మీ ఖాతాకు సంబంధించి kyc ని అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఒకవేళ kyc పూర్తీ చెయ్యకుంటే మాత్రం మీ ఖాతాను మూసివేయవచ్చు. దీనితో మీ ఖాతా నుండి ఎలాంటి లావాదేవీలు చేయలేరు.
KYC ఎలా చేయాలంటే ?
KYC కోసం డాక్యుమెంట్‌లను సమర్పించే ముందు, KYC వివరాలను అప్‌డేట్ చేయడానికి మీరు సంభంధిత పత్రాలను బ్యాంక్‌కి సమర్పించాలి.
KYC కి కావలసిన పత్రాలు:
పాస్పోర్ట్
ఓటర్ ID కార్డ్
డ్రైవింగ్ లైసెన్స్
ఆధార్ కార్డ్ /
NREGA కార్డ్
పాన్ కార్డ్
గమనిక: మైనర్ ఖాతాదారుడి వయస్సు 10 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే, ఖాతాను నిర్వహిస్తున్న వ్యక్తి ID రుజువును సమర్పించాలి.