అమెజాన్ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్ వివరాలు ఇవే..

Amazon Great Indian Festival Sale

0
98
Amazon Layoffs

పండుగ సీజన్ ను క్యాష్ చేసుకోడానికి అమెజాన్ ​మరో భారీ సేల్​కు సిద్ధమవుతోంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​ను ప్రకటించింది. ఈ సేల్​లో భాగంగా ప్రముఖ ఎలక్ట్రానిక్​ ఉత్పత్తులు, గృహోపకరణాలపై భారీ ఆఫర్లను ప్రకటించనుంది.

స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్​ ఇలా అన్ని ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇక వన్ ప్లస్-9 మోడళ్లపై భారీ డిస్కౌంట్లు అమెజాన్ అందించనుంది. దసరా, దీపావళి దగ్గరలో ఉండడంతో అమెజాన్ సేల్స్ ను పెంచుకోడానికి అక్టోబర్ 3 నుండి గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​ను నిర్వహించనుంది.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే ప్రతి ప్రొడక్ట్​పై 10 శాతం అదనపు డిస్కౌంట్ అందించనున్నట్లు పేర్కొంది. దాదాపు వెయ్యికి పైగా కొత్త ఉత్పత్తులు అమెజాన్‌ సేల్‌లో భాగంగా లాంచ్‌ కానున్నాయి.  ఈ మేరకు హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ అమెజాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.