మరో ఘనత సొంతం చేసుకున్న రిలయన్స్‌..!

Another credit to Reliance‌ ..!

0
269

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌).. గత అయిదేళ్లలో దేశంలోనే అత్యంత అధికంగా సంపద సృష్టించిన కంపెనీగా ఘనత సాధించింది.. 2016-21లో ఏకంగా రూ.9.6 లక్షల కోట్ల సంపదను జత చేసుకుంది. దీంతో 2015-19లో తానే నెలకొల్పిన రూ.5.6 లక్షల కోట్ల రికార్డును బద్దలుకొట్టింది. మోతీలాల్‌ ఓస్వాల్‌ 26వ వార్షిక సంపద సృష్టి నివేదిక ఈ విషయాలను వెల్లడించింది.

అదానీ గ్రూప్‌ కంపెనీలైన అదానీ ట్రాన్సిమిషన్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లు అత్యంత వేగంగా(93 శాతం సీఏజీఆర్‌), అత్యంత స్థిరంగా (86% సీఏజీఆర్‌) సంపదను సృష్టించిన కంపెనీలుగా నిలిచాయి. రంగాల వారీగా అత్యధిక సంపదను సృష్టించిన వాటిలో ఆర్థిక రంగం తొలి స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానంలో వినియోగదారు, రిటైల్‌ రంగం ఉంది.

అంతక్రితం అయిదేళ్లలో 18 శాతం సంపద ఈ రంగం నుంచే రాగా.. ఈ సారి అది 25 శాతానికి చేరుకుంది. తమ వాటాను అధికంగా పోగొట్టుకున్నవాటిలో వాహన, ఫార్మా సంస్థలున్నాయి. సంపద సృష్టిలో ప్రభుత్వ రంగ సంస్థలు చివర్లో నిలిచాయి. కేవలం గుజరాత్‌ గ్యాస్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌లు మాత్రమే జాబితాలో నిలిచాయి.