వాట్సాప్​లో మరో కొత్త ఫీచర్..అడ్మిన్​గా ఉన్న గ్రూప్ లో..

0
106

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు న్యూ ఫీచర్స్ తీసుకొస్తుంది. తాజాగా ఓ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. వాట్సాప్​లో ఎవరికైనా తప్పుగా మెసేజ్​ చేశారా? అది కూడా రెండు గంటలు తర్వాత చూసుకున్నారా? డిలీట్​ చేయడం కుదరదు కదా అని బాధపడొద్దు. ఎందుకంటే ఇప్పుడు మెసేజ్​ చేసి రెండు రోజులు అయినా కూడా డిలీట్​ చేయవచ్చు. అందుకు సంబంధించిన కొత్త ఫీచర్​ను వాట్సాప్​ త్వరలోనే తీసుకురాబోతుంది.

వాట్సాప్​ చాట్​లో ‘డిలీట్​ ఫర్​ ఎవ్రీవన్’​ ఫీచర్​ను 2017లో అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదట.. ఆ ఫీచర్​ను ఎనిమిది నిమిషాలకు మాత్రమే పరిమితం చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు 1 గంట 8 నిమిషాల 16 సెకన్ల వరకు డిలీట్​ చేసే అవకాశాన్నిచ్చింది. ఇప్పుడు ఈ ఫీచర్​ను​ ఇంకాస్త సమయానికి పెంచుదామని వాట్సాప్​ యోచిస్తోంది.

కొత్త ఫీచర్​ వచ్చాక వాట్సాప్​లో పంపిన మెసేజ్​ను 56 గంటల తర్వాత డిలీట్​ చేసుకోవచ్చు. అంటే రెండున్నర రోజులైనా డిలీట్​ చేసేయొచ్చు. ఈ ఫీచర్​ అందుబాటులోకి వస్తే చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్​ టెస్టింగ్​ మోడ్​లో ఉంది. మరికొద్దిరోజుల్లోనే అందుబాటులోకి రానుంది. దీంతో పాటు మరో ఫీచర్​ను ​కూడా వాట్సాప్​ తీసుకురానుంది. మీరు అడ్మిన్​గా ఉన్న గ్రూప్​​లోని ఏ మెసేజ్​నైనా డిలీట్​ చేసే అవకాశాన్ని కల్పించనుంది.