ఫోన్​లో యాప్స్ ఇన్‌స్టాల్ కావట్లేవా? అయితే ఇలా చేయండి..

0
100

అప్పుడప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్, ట్యాబ్, ల్యాప్ టాప్ లలో యాప్స్ ఇన్‌స్టాల్‌ కాకా చాలామంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అందుకే ఈ సమస్యను ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..ఆండ్రాయిడ్ గ్యాడ్జెట్లలో ఏదైనా పెద్ద యాప్‌ లేదా గేమ్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవటానికి ముందు ఫోన్‌లో ఎంత ఫ్రీ స్టోరేజీ ఉందో చూసుకోవాలి.

ఇంటర్నల్‌ మెమరీ తక్కువగా ఉంటే ఇన్‌స్టలేషన్‌ ఎర్రర్‌ చూపిస్తుంది. కొన్నిసార్లు గూగుల్‌ ప్లే స్టోర్‌ సరిగా పనిచేయకపోవచ్చు. అప్పుడు ఆ యాప్‌ను ఫోర్స్‌ స్టాప్‌ చేసి, తిరిగి ప్రయత్నిస్తే ఫలితం కనిపిస్తుంది. ప్లేస్టోర్‌ ఇన్ఫో మెనూ ద్వారా స్టోరేజీలోకి వెళ్తే క్యాచీ ఆప్షన్‌ కనిపిస్తుంది.

దీని ద్వారా క్యాచీని క్లియర్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత యాప్స్‌ నెమ్మదిగా డౌన్‌లోడ్‌ అవుతుండొచ్చు గానీ ఇన్‌స్టలేషన్‌ ప్రక్రియ సజావుగా సాగుతుంది. కానీ లొకేషన్‌ షరతుల కారణంగా కొన్ని డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి ఆయా యాప్స్‌ మన పరికరాలకు అందుబాటులో ఉన్నాయో, లేదో ముందే చూసుకోవడం మంచిది.