జియో సిమ్ వాడుతున్నారా?- భారీ క్యాష్ బ్యాక్ మీసొంతం ఇలా..

0
98

మీరు జియో సిమ్ కార్డ్ వాడుతున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. జియో సిమ్ కార్డ్ రీచార్జ్ చేసుకుంటే క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ అందరికీ అందుబాటులో లేదు. కొందరికే వర్తిస్తోంది.

రిలయన్స్ రిటైల్ తాజాగా జియో ప్రిపెయిడ్ కస్టమర్లకు మూడు రిచార్జ్ ప్లాన్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. 20 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అక్టోబర్ 2 నుంచి క్యాష్‌బ్యాక్ ఆఫర్ అమలులోకి వచ్చింది. రిలయన్స్ రిటైల్ స్టోర్లు, రిలయన్స్ డిజిటల్, ఏజియో వంటి వాటిల్లో క్యాష్‌బ్యాక్ రిడీమ్ చేసుకోవచ్చు.

జియో వెబ్‌సైట్ లేదా మైజియో యాప్ ద్వారా రీచార్జ్ చేసుకుంటేనే ఆఫర్ వర్తిస్తుంది. రూ.249, రూ.555, రూ.599 ప్లాన్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంది. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా రీచార్జ్ చేసుకుంటే ఎలాంటి ఆఫర్లు అందుబాటులో ఉండవు.

యూజర్లు జియో.కామ్‌లోకి వెళ్లిన తర్వాత ప్రిపెయిడ్‌లోని వెళ్లాలి. అక్కడ పాపులర్ ప్లాన్స్ ఎంచుకోవాలి. తర్వాత 20 శాతం క్యాష్‌బ్యాక్ కింద నచ్చిన ప్లాన్ ఎంపిక చేసుకోవాలి. కొనుగోలు చేయాలి. రీచార్జ్ పూర్తయిన తర్వాత క్యాష్‌బ్యాక్ జియో అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది.