మీరు యూట్యూబ్‌ వాడుతున్నారా?..అలా చేస్తే డబ్బులు కట్టాల్సిందే!

Are you using YouTube?

0
106

ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఎప్పుడైనా మనకు బోర్‌ కొడితే యూట్యూబ్‌ తెరుస్తాం. కావాల్సినంత సేపు వీడియోలు చూస్తాం.కొన్నిసార్లు పని ఉండడం వల్ల మనకు అవసరమున్న వాటిని డౌన్ లోడ్ చేసుకొని వీలైనప్పుడు చూస్తాం. అలాగే డేటా వేగంలో ఇబ్బందులున్న వారైతే తమకు కావాల్సిన వీడియోలను ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. తర్వాత నచ్చినప్పుడు చూసుకుంటారు. కానీ ఇకపై అలా కుదరదు.

మునుపటిలా యూట్యూబ్​లో వీడియోలను డౌన్​లోడ్ చేసుకోవడం కుదరదు. ఒకవేళ మీరు అలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలి. అంటే నెలనెలా డబ్బులు కట్టాలన్నమాట!

ఒకటి ఇంటర్నెట్‌ వేగంతో సంబంధం లేదు కాబట్టి వీడియో బఫర్‌ అవుతుందన్న బాధ లేదు. పైగా ఎన్నిసార్లయినా చూసుకోవచ్చు. రెండోది ఆఫ్‌లైన్‌ వీడియోలకు ప్రకటనలు రావు. అయితే, ఇప్పుడు ఇలా ఆఫ్‌లైన్‌లో వీడియోలు డౌన్‌లోడ్‌ చేసుకునే వారికి యూట్యూబ్‌ షాకిచ్చింది. మునుపటిలా వీడియోలను హై, ఫుల్‌ హెచ్‌డీ క్వాలిటీ వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఇకపై కుదరదు. ఒకవేళ మీరు అలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలి. అంటే నెలనెలా డబ్బులు కట్టాలన్నమాట!

ఇప్పటి వరకు లో, మీడియం, హై, ఫుల్‌ హెచ్‌డీ క్వాలిటీ..ఇలా ఎలాంటి క్వాలిటీ వీడియో అయినా ఉచితంగా ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. యూట్యూబ్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో లో, మీడియం క్వాలిటీ వీడియోలను మాత్రమే ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే వీలు ఉంది. యూట్యూబ్‌ తాజా నిర్ణయం పట్ల నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే ప్రకటనలు లేకుండా వీడియోలు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలని సూచిస్తున్న యూట్యూబ్‌.. తాజా నిర్ణయంతో మరింత మందిని సబ్‌స్క్రిప్షన్‌ పంచుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.