అమెజాన్ ప్రైమ్​ వినియోగదారులకు బ్యాడ్​ న్యూస్..సోమవారం నుంచే…

Bad news for Amazon Prime customers ... from Monday ...

0
98

అమెజాన్‌ ప్రైమ్‌ వినియోగదారులకు ఆ సంస్థ షాక్​ ఇచ్చింది. ఈ నెల 13 నుంచి సబ్‌స్క్రిప్షన్‌ ధరలు పెరగనున్ననట్లు పేర్కొంది. వార్షిక సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఇతర ప్లాన్‌ ధరలను కూడా సవరించనుంది. పెంపునకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే అమెజాన్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వారికి ప్రైమ్‌ వీడియోలు, ప్రైమ్‌ మ్యూజిక్‌తోపాటు, ఉచిత హోమ్‌ డెలివరీ వంటి ప్రయోజనాలు అందుతున్నాయి. ఇందుకు ఏడాదికి రూ.999 అమెజాన్‌ వసూలు చేస్తోంది. కానీ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ వార్షిక చందాను రూ.999 నుంచి రూ.1499కి పెంచనున్నట్లు అమెజాన్‌ తెలిపింది. త్రైమాసిక చందా ప్రస్తుతం రూ.329 ఉండగా.. దాన్ని రూ.459కి పెంచనున్నట్లు పేర్కొంది.

నెలవారీ ప్లాన్‌కు ప్రస్తుతం రూ.129 చెల్లిస్తుండగా ఇకపై రూ.179 చెల్లించాల్సి ఉంటుందని అమెజాన్‌ తెలిపింది. అయితే పెరిగిన ధరలు ఈ నెల 13 నుంచి అందుబాటులోకి రానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్​ను తీసుకున్న వారు.. కొత్తగా తీసుకోదలిచిన వారికి మరో వారం రోజులు మాత్రమే పాత ధరలు అందుబాటులో ఉండనున్నాయి.