బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..బ్యాంకు ఉద్యోగుల సమ్మె..నేటి నుంచి రెండు రోజుల పాటు ఆ సేవలు బంద్

Bank employees strike..those services are closed..when is it?

0
81

బ్యాంకుల పైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు సమ్మె బాట పట్టనున్నాయి. డిసెంబర్​ 16, 17 తేదీల్లో సమ్మె చేయాలని నిర్ణయించినట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్​బీయూ) తెలిపింది. సమ్మె ప్రభావంతో పలు సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని వినియోగదారులను హెచ్చరించాయి బ్యాంకులు.

బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్​బీ)ను ప్రైవేటీకిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి వ్యతిరేకంగా తాము ఈ సమ్మె చేపడుతున్నట్లు పేర్కొంది యూఎఫ్​బీయూ.

పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా 2019లో ఐడీబీఐ బ్యాంక్​లోని మెజార్టీ వాటాను ఎల్​ఐసీకి విక్రయించింది. ఇలా నాలుగేళ్లలో 14 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసింది. బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి, ఆమోదింపచేయడానికి కేంద్ర ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని సమ్మె చేయనున్నారు.