జూలై నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్..ఏ ఏ రోజుల్లో అంటే?

0
177

మీరు బ్యాంకు పని మీద వెళుతున్నారా? మరి ఆయా రోజుల్లో బ్యాంకు ఉందా లేదా? అనేది తెలుసుకున్నారా? ఎప్పుడెప్పుడు బ్యాంకులకు సెలవులు ఉన్నాయనే వివరాలు తెలుసుకుంటే ముందుగానే బ్యాంకు పనులకు ప్లాన్ చేసుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా ఆర్‌బీఐ జూలై -2022 సెలవుల జాబితాను విడుదల చేసింది.

దీని ప్రకారం జూలై నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే ఇవి మొత్తం దేశంలో ఒకే రోజు సెలవులు కావు. వివిధ రాష్ట్రాల్లో నిర్వహించుకునే పండుగల ప్రకారం ఈ సెలవుల జాబితాను ఆర్బీఐ జారీ చేస్తుంది. ఈ క్రమంలో బ్యాంకులకు జూలై నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఉన్నాయనే వివరాలు తెలుసుకుంటే మందుగానే బ్యాంకు పనులకు ప్లాన్ చేసుకోవచ్చు.

జూలై నెలలో ఐదు ఆదివారాలు ఉన్నాయి. జూలై 3, 10, 17, 24, 31 తేదీల్లో ఆదివారం కావడంతో బ్యాంకులు తెరుచుకోవు. ఇక జూలై 9న సెకండ్ శనివారం(అదేవిధంగా బక్రీద్), జూలై 23న నెలలో నాల్గవ శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇతర రోజుల్లో జూలై 1న కాంగ్ (రథయాత్ర)/రథయాత్ర (భువనేశ్వర్-ఇంఫాల్‌లో బ్యాంక్ మూసివేస్తారు).

జూలై 5న (మంగళవారం) గురు హరగోవింద్ సింగ్ జీ ప్రకాష్ దివాస్ (జమ్మూ, కాశ్మీర్ బ్యాంక్ మూసివేస్తారు). జూలై 7న ఖర్చి పూజ (అగర్తలాలో బ్యాంకులు మూసివేస్తారు). జూలై 11న ఈద్-ఉల్-అజా (జమ్మూ, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూసివేస్తారు). జూలై 13న భాను జయంతి (గ్యాంగ్‌టక్ బ్యాంక్ మూసివేస్తారు). జూలై 14న బెన్ డియెంక్లామ్ (షిల్లాంగ్ బ్యాంక్ మూసివేస్తారు). జూలై 16న హరేలా (డెహ్రాడూన్ బ్యాంక్ మూసివేస్తారు).