కాలక్షేపం కోసం గాలం వేయగా ల‌క్షాధికారి అయ్యాడు

Became a millionaire while tuning in for the pastime

0
98

ఈ మ‌ధ్య మ‌నం వార్త‌లు వింటూ ఉన్నాం ప‌లు వీడియోలు ఫోటోలు చూస్తు ఉన్నాం. చాలా అరుదైన చేప‌లు వ‌ల‌లో చిక్కుతున్నాయి. ఇలా దొరికిన‌ చేప‌లు కూడా ల‌క్ష‌ల ధ‌ర ప‌లుకుతున్నాయి. అనేక దేశాల్లో ఇలాంటి వార్త‌లు విన్నాం. అయితే ఇటీవ‌ల మ‌న దేశంలో కూడా చాలా మంది జాల‌ర్ల‌కు ఇలాంటి సంతోక‌ర‌మైన సంఘ‌ట‌న‌లు ఎన్నో జ‌రిగాయి.

తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఓ వ్యక్తి సరదాగా గాలం వేస్తే అరుదైన మీనం చిక్కుకుంది. ఇంత‌కీ అత‌నికి వ‌చ్చిన ఆ అదృష్టం ఏమిటో చూద్దాం. పి.గన్నవరం ద‌గ్గ‌ర గోదావరి నదిపై ఉన్న ఆక్విడెక్ట్ ద‌గ్గ‌ర సాయంత్రం వేళ కాలక్షేపం కోసం గాలం వేశారు. దీంతో భారీ అలుగు చేప పడింది.

3 అడుగుల పొడవు, 10 కిలోల బరువున్న ఆ చేపను అమ్మకానికి పెట్టారు ఏకంగా రూ.2.5 లక్షల ధర పలికింది. వరద ప్రవాహం అధికంగా ఉండడంతో భారీ చేపలు ఎగువ ప్రాంతాల నుంచి వస్తుంటాయని వివరించారు. దీంతో వారు చాలా ఆనందంలో ఉన్నారు. ఇవి చాలా అరుదుగా చిక్కుతాయ‌ని తెలిపారు.